అడివి బాపిరాజు రచనలు-2- హిమబిందు -చారిత్రక నవల
- Author:
- Pages: 296
- Year: 2010
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹200.00
హిమబిందు అడివి బాపిరాజు 1944లో రాసిన చారిత్రక నవల. ఇది ఆంధ్రుల చరిత్రలో శాతవాహనుల కాలానికి సంబంధించిన నవల. ప్రథమ ఆంధ్ర శాతవాహన చక్రవర్తియైన శ్రీముఖ శాతవాహనుడు, అతని కుమారుడు శ్రీకృష్ణ శాతవాహనుడు, శిల్పి సువర్ణశ్రీ, వ్యాపారవేత్త చారుగుప్తుడు, అతని తనయ హిమబిందుల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
ఈ పుస్తకం రాయడానికి రచయిత శాతవాహనుల కాలం నాటి భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, మతం, కళలు, యుద్ధ శాస్త్రం మొదలైన అనేక అంశాల మీద సునిశతమైన అధ్యయనం చేశాడు. చరిత్రలో పాత్రలను తీసుకుని తన కల్పనా శక్తితో నవలలుగా మలిచాడు రచయిత.
ఈ పుస్తకం చివరలో దాశరథి కృష్ణమాచార్యులు ఈ విధంగా అంటాడు.
ఆయన (అడివి బాపిరాజు) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏ నవలైనా తీసుకుని చదివితే ఆయనకు ఎన్నెన్ని విషయాలు తెలుసో అర్థమవుతుంది. తలస్పర్శిగా తెలిసిన వ్యక్తి ఆయన.
ఈ పుస్తకంలో సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పకళ వంటి వాటిని గురించి సవివరంగా రాశాడు రచయిత.
Tags: Adavi Bapiraju Rachanalu-2, Narayanarao Navala, అడివి బాపిరాజు రచనలు-2, హిమబిందు -చారిత్రక నవల, Visalandhra Publishing House, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్