Adolf Hitler | అడాల్ఫ్ హిట్లర్
- Author:
- Pages: 175
- Year: 2015
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Pallavi Publications-పల్లవి పబ్లికేషన్స్
-
₹120.00
ప్రపంచ చరిత్రలో ఇన్ని విమర్శలకు గురైన నాజీ నియంత హిట్లర్ వంటి సాహసికుడు మరొకడులేడు. ఇతడు 1889 ఏప్రియల్ 20న ఆస్ట్రియాలో జన్మించాడు. మొదటి ప్రపంచయుద్ధంలో ఒక సామాన్య సైనికుడు జన్మత ఆస్ట్రియన్ అయిన హిట్లర్ జర్మన్ తరపున పోరాడాడు. ఆ యుద్ధంలో జర్మనీ ఓటమిని జీర్ణించుకోలేని ఇతడు తన ఎత్తులు జిత్తులతో జర్మనీ చాన్సలర్ తర్వాత అధ్యక్షుడు, సర్వసైన్యాధిపతై ప్రపంచాన్ని వణికించాడు. ఐరోపాలో ఒక పక్క ఇంగ్లండ్ మరో పక్క రష్యా తప్ప మొత్తాన్ని జయించడమే కాక మిలియన్ల యూదులను తనకున్న ద్వేషంతో ఊచకోతకోశాడు. కమ్యూనిస్టు వ్యతిరేకి అయిన ఇతడు ఐరోపా దేశాలపై యుద్ధం చేస్తూనే తూర్పున రష్యాపై దాడి చేసి తప్పటడుగు వేశాడు. ఇంగ్లండ్, అమెరికా, రష్యాలతో ఒకేసారి యుద్ధం చేసి ఓటమి తప్పని దశలో ఆత్మహత్య చేసుకున్నాడు.
జర్మన్ సామ్రాజ్య విస్తీర్ణాన్ని కాంక్షించిన ఇతడు 40 మందితో ఏర్పడిన నాజీ పార్టీకి అధ్యక్షుడై అతి తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా తీర్చిదిద్ది 12 సంవత్సరాలు పైగా జర్మన్ సామ్రాజ్యన్ని నియంతగా పాలించి 1945 ఏప్రియల్ 30న మరణించాడు.
Tags: Adolf Hitler, అడాల్ఫ్ హిట్లర్, Swarna, స్వర్ణ, Pallavi Publications, పల్లవి పబ్లికేషన్స్