Prakrithisparsa|ప్రకృతిస్పర్శ

Prakrithisparsa|ప్రకృతిస్పర్శ

  • ₹225.00

కేశవ పరుగెడుతూ ఒక్క క్షణం ఆగాడు. చేతిని వెనక్కి జరిపి,

పిలక పట్టుకుని గట్టిగా లాగాడు. నొప్పి చేసింది. పిలక ముడి ఊడిపోయింది. ఒక్కసారి తల పంకించి మళ్లీ పరుగుతీశాడు.

పిలక కిందకూ మీదకూ ఊగుతోంది...

కొన్నిరోజుల ఒంటరితనానికే తను అలాగైపోతే మరి నాన్న?

కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా గడుపుతున్న

నాన్న గురించి తనెందుకు ఆలోచించలేకపోయాడు?

పాముల భయం లేకుండా ప్రజల్ని కాపాడిన తన కుటుంబం,

పాముల్ని చూపి ప్రజల్ని భయపెట్టి బతకాల్సివచ్చినందుకు

సింహాద్రి విలవిలలాడిపోయాడు.

అసహజ మరణాల్లానే అసహజ జీవనాలూ అపసవ్యాలు కావా? సహజత్వంలోని సౌందర్యం అసహజత్వంలో ఏ కోశానా ఉండదు. సహజ జీవనంలో ఉండే శక్తిసామర్థ్యాలూ, లక్ష్యాలూ, తపనలూ, వాటిని సాధించడంలో కలిగే సంతృప్తి అసహజ జీవనంలో మృగ్యం.

“ప్రతిదానికీ యంత్రాల మీద ఆధారపడ్డం కంటే ప్రకృతి మీద ఆధారపడ్డం మంచిదనుకుంటాను. రేపటినుంచి మల్లెపూలు తీసుకురండి.

మీకిష్టం లేకపోతే వద్దులెండి” అంది ఇందుమతి.

‘శ్రీరాముడి పట్టాభిషేకంతో రామాయణం పూర్తిచేసి, సమాజంపట్ల

నా బాధ్యత తీరిందనుకున్నాను. కానీ, ఉత్తర రామాయణం రాయవలసి వచ్చింది. అక్కడితో నా బాధ్యత తీరిందనుకుని తపస్సమాధిలో వుండిపోయాను. అయితే, ఇప్పుడు ఆధునిక రామాయణం రాయవలసిన అవసరం వచ్చింది. రాయక తప్పదు మరి’ అనుకున్నాడు వాల్మీకి.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Prakrithisparsa, ప్రకృతిస్పర్శ, కె.వి.యస్. వర్మ కథలు, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ, 9789393056313