Quilt|క్విల్ట్

Quilt|క్విల్ట్

  • ₹300.00

అతివల గురించి అందరమూ మాట్లాడుకుంటూ ఉంటాము. కొన్ని విలువలు తూకంరాళ్లని సొంతం చేసుకొని ఇతరుల నిర్ణయాల్నీ, వ్యక్తిత్వాన్నీ తూకం వేస్తుంటాం. అటువంటి విలువల్ని చూపించే కథలివి.

---తల్లావజ్ఞల పతంజలిశాస్త్రి

Fictionలో తెలిసిన విషయాన్ని ఏమీ తెలియనట్లు, తెలియని విషయాన్ని తెలిసినట్లు చెప్పాలి. అలా చెప్పునప్పుడే కథ ఆసక్తిదాయకంగా సాగుతుంది. కథలు చెప్పేవాడికీ, మెజీషియన్‌కి చిన్న తేడా ఉంటుంది. మెజీషియన్‌ ఏదైనా ట్రిక్‌ చేసి చివర్లో అంతా రివీల్‌ చేసినా ప్రేక్షకుల ఇగో హర్ట్‌ కాదు. అమ్మూజ్‌ అవుతారు. కానీ ఒక కథకుడు మాయ చేసినట్టు కనిపిస్తే పాఠకులు ఒప్పుకోరు. తెలియని విషయం ఆసక్తిదాయకంగా చెప్పినప్పుడే పాఠకుడు ఇష్టపడతాడు. కానీ పాఠకునికి తెలిసిన విషయాన్ని రచయిత తనకి మాత్రమే తెలిసినట్టు చెబితే పాఠకుడి ఇగో హర్ట్‌ అవుతుంది. Honesty, brilliance సమపాళ్లలో ఈ కథల్లో కనిపిస్తాయి.

--- రవి వీరెల్లి

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Quilt, క్విల్ట్, Sai Brahmanandam Gorti, సాయి బ్రహ్మానందం గొర్తి