Aashramamoo Aadhunikatha! | ఆశ్రమమూ ఆధునికత!

Aashramamoo Aadhunikatha! | ఆశ్రమమూ ఆధునికత!

  • ₹180.00

వ్యతిరేకతలు నిజమేనా? లేదా వ్యతిరేకతల మధ్య తెలియని ఒక సమస్వయం వుందా? మానసికశాస్త్రం చెప్పినట్లు తండ్రిని వ్యతిరేకించే ప్రక్రియ ఒక చిన్న పిల్లవాడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగమా? ఆయనే చనిపోతే ఆ ఘర్షణ నుండి అనేక అస్తిత్వ ప్రశ్నలు పుట్టుకొస్తాయా? కొడుకు తాను ఎదిగే క్రమంలో తండ్రిని వ్యతిరేకిస్తూ, తరువాతి కాలంలో తండ్రిగానే మారిపోతాడా?

"విధి చేయు వింతలన్నీ... మతి లేని చేతలేనని / విరహాన వేగిపోయి... విలపించే కథలు ఎన్నో..." అంటారు ఆత్రేయ "మరోచరిత్ర" సినిమా పాటలో. ప్రేమ గుడ్డిదో కాదో కానీ, యవ్వనం మాత్రం ఎవరి మాటా వినదు. "పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటిదండాలు..." అని కూడా అంటారు ఆత్రేయ అదే సినిమాలో! ఆకసాన చందమామ, భూమిపై ఆత్రేయ - ఇద్దరూ ప్రేమి'కుల' దైవాలు. ప్రేమి'కుల' దైవాలు.

భారతీయ కథలు చిత్రించినంత గొప్పగా జీవనసౌందర్యాలని, అగాధాలని  పాశ్చాత్య కథలు ఎప్పుడూ సృష్టించలేదు. కానీ ఈవేళ మేధావి అనే ఏ భారతీయుణ్ణి పలకరించినా, చెహోవ్, మార్క్ ట్వేన్, ఎడ్గార్ అలెన్ పో, కాఫ్కా అంటూ... ఓ వందపేర్లు చెప్పేస్తారు. పొరబాటున ఈ దేశ సాహిత్యం గురించి అడిగామా- మనల్ని అత్యంత హేయనీయమైన జీవిగా చూస్తారు. ఓ సమాజం తన ఔన్నత్యాన్ని, గతాన్ని మర్చిపోవడం అనేదానికి ఈ దేశమే ఓ పెద్ద ఉదాహరణ!

ప్రసిద్ధ రచయిత ఆల్విన్ టోఫ్లర్ ఒకచోట అంటాడు- ''ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో నిరక్షరాస్యుడు అంటే చదవడం, వ్రాయడం రానివాడు కాదు; జ్ఞానం పొందడం, దాన్నుంచి పూర్తిగా బయటపడటం, తిరిగి పునర్నిర్మించుకోడం చేయలేనివాడు" అని. అందుకే చదువుకున్నదాన్నుంచి బయటపడటం, మరలా కొత్తగా నేర్చుకోవడం అనే ప్రక్రియలు చాలా అవసరం.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: ఆశ్రమమూ ఆధునికత, అవధానం రఘుకుమార్, అనల్ప, 9789393056115