JAAJULA JAAVALI | జాజుల జావళి

JAAJULA JAAVALI | జాజుల జావళి

  • ₹150.00

నేలకూ నింగికీ మధ్య

కడుతూ ఆపేసిన

ప్రాచీన వారధిలా...


కనుచూపుమేరలో గంభీరంగా!


ఏ ఝామున జాబిల్లితో

దోబూచులాటలో!

శిఖరాన సేద తీర్చుకుంటున్న

మబ్బుతునకలు...


మెలమెల్లగా అలుముకుంటున్న

పచ్చదనం...


ఏ వింత అనుభవాన్ని

పంచుకుంటున్నాయో!

మూకుమ్మడిగా గువ్వల కిలకిలలు...


అలుపెరుగకుండా

పాదాలతో ఆడుకుంటున్న సెలయేరు...


ఆసాంతం చైతన్యఝరి...

తను మాత్రం నిశ్చలంగా!

విశ్వరహస్యాలను భద్రపరుస్తూ!!

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: JAAJULA JAAVALI, జాజుల జావళి, Nishigandha, నిషిగంధ, అనల్ప, 9789393056030