Gopalle Janalu|గోపల్లె జనాలు
- Author:
- Pages: 240
- Year: 2016
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Arts & Letters-ఆర్ట్స్ & లెటర్స్
-
₹150.00
గోపల్లె జనాలు
మూలం: కి. రాజనారాయణన్ , అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్
ఆ కాలాన మాసాల తరబడి అడవిదారి కడచి వచ్చేరో వివరంగా తెలిపేదే "గోపల్లె" నవల. ఆ తరువాత మా పల్లె కంటిచూపుతో నాటి దేశకాల పరిస్థితుల్లో వస్తూ ఉండిన మార్పులను (తెల్లవాళ్ళు మన దేశం నుండి పోయే వరకూ) తెలిపేదే "గోపల్లె జనాలు". ఆంధ్రనాడు నుండి మా పెద్దవాళ్ళు దగ్గర దగ్గర ఎనిమిది వందల ఏళ్ళకి ముందే దక్షిణాదికి చేరుకున్నారు. అప్పటి నుంచి మా కుటుంబం తూత్తుకుడి జిల్లాలో "ఇడైసేవల్" పల్లెలో కుదురుకుని ఉన్నది. మా పెద్దవాళ్ళు ఏ కారణాన ఎన్ని ఇడుములపడి (Foreword), తమిళంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల.
నేను ఒకనాడు నా తల్లినేలకు బయలెక్కితి. “రైలు బండి ఎక్కేస్తిని, రాత్రంతా ప్రయాణం, ఒకటే నిద్రపోతా ఉంటి. దిడీర్న మెలకవ వచ్చె. రైలు పాకాల జంక్షన్‌కు చేరె. ఇడ్లీ, వడ, దోసె, పొంగల్ అంటూ ఫలహారాలు అమ్మేవాళ్లు ఒకపక్క, టీ, కాఫీ, పేపర్ అమ్మేవాళ్లు మరోపక్క ఎక్కడ చూసినా తెలుగు సద్దే! నాకు ఎక్కడికో దేవలోకానికి వచ్చినట్లు ఉనింది. మా పెద్దవాండ్లు ఉండిన నేలమీద కాలిడుతూనే ఆ ‘మన్వాసన’కు ఏదో తెలియని సంతోషం. నా కండ్లలో నీరు తెలుగుమాట రుచి తగిలితే నిండా బాగుండు. తెలుగునాడు తెలుగైతే నిండానిండా బాగుండు తెలుగుదనాన్ని ఇక్కడి తెలుగువాళ్లతో మాటాడినపుడు నేను రుచి చూస్తున్నాను. మనమంతా తెలుగుతల్లి బిడ్డలం. ఏదో కాలవశాన ఎప్పుడో ‘మేము’ ఈ పక్కలో ఉండిపోతిమి, ‘మీరు’ ఆ పక్కలో ఉండిపోతిరి. ‘మనం’ ఉండేది ఎక్కడైనా మనం మాట్లాడే ‘తెలుగుభాషను’ వీడకూడదు”.
Tags: Gopalle Janalu, గోపల్లె జనాలు, మూలం: కి. రాజనారాయణన్, అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, Ki. Rajanarayanan (Author), Sripada Jayaprakash (Translator), Arts & Letters, ఆర్ట్స్ & లెటర్స్, 9788192767970