Kannada Dalita Kathalu | కన్నడ దళిత కథలు
- Author:
- Pages: 149
- Year: 2016
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹100.00
అనువాదం: రంగనాథ రామచంద్రరావు | Ranganatha Ramachandra Rao
ఏ దేశంలోనైనా గర్వించదగిన అంశాలుంటాయి. సిగ్గుపడాల్సిన అంశాలూ ఉంటాయి. భారతదేశంలోనూ ఈ రెండు రకాల అంశాలూ ఉన్నాయి. అయితే ఏది గర్వపడవలసినదీ, ఏది సిగ్గుపడవలసినదీ అన్నది ఆ పడేవాళ్ళ దృక్పథం చైతన్యాలను బట్టి ఉంటుంది. గర్వించదగిన వాటినే చెప్పుకుంటూ తొడలుకొడుతూ, జబ్బలు చరుస్తూ, సిగ్గుపడాల్సిన వాటిని విస్మరిస్తే దానివల్ల దేశానికి జరిగే నష్టం అపారం. సిగ్గుపడాల్సిన విషయాలను ఎత్తిచూపి దాని మూలాలను గుర్తించి వాటిని పరిష్కరించుకుంటే జాతికి తలవంపులు తప్పుతాయి. భారతదేశ గొప్పతనాన్ని గురించి ఆవేశంగా చాలా విషయాలు చెప్పుకుంటాం. ''లేదురా యిటువంటి భూదేవి ఎందు'' అని పొంగిపోతాం. ఇక్కడ వేదాలు పుట్టాయి. ఉపనిషత్తులు పుట్టాయి. సప్తర్షులు పుట్టారు. అష్టాదశ పురాణాలు పుట్టాయి. భగవద్గీత పుట్టింది. మరుక్కోటి దేవతలున్నారు - ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అదే సమయంలో ఇక్కడ అంటరానివారున్నారు. మాలమాదిగ పల్లెలున్నాయి. వాళ్ళు కష్టజీవులు. వాళ్ళకు సుఖసంతోషాలు లేవు- అంటే మన నోళ్ళు మూతపడతాయి. కనుబొమలు ముడివడతాయి. ఈ స్థితి మీద ''కలదమ్మా వ్రణమొక్కటి'' అంటూ గుర్రం జాషువ 'వచింప సిగ్గగున్' అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో సిగ్గుపడాల్సిన మొదటి అంశం అంటరానితనం అనే దుర్మార్గం. ఇది మన దేశంలోని సాంఘిక నిరంకుశత్వానికి పరాకాష్ఠ. మనం గర్వపడే అంశాలన్నింటినీ ప్రశ్నించేది అంటరానితనం. స్వాములు, బాబాలు, విద్వాంసులు ప్రతీరోజూ వ్యాఖ్యానించి చెప్పే పురాణా సారాన్ని అంటరానితనం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంది. సమాధానం మాత్రం శూన్యం. మనుషుల్ని మనుషులుగా చూడని దేశంలో అలాంటి గొప్పలు ఎన్నుంటే ఎందుకు? సాటి మనుషులను ఊరికి దూరం చేసి, ఉనికికి దూరం చేసి, అవమానించి, వాళ్ళ శ్రమనూ, మానాన్ని దోచుకొని ఆనందించే దుర్మార్గం ముందు - మరే గొప్పతనమూ గొప్పతనంగా నిలవదు.
- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
Tags: Kannada Dalita Kathalu, కన్నడ దళిత కథలు, రంగనాథ రామచంద్రరావు, Ranganatha Ramachandra Rao