Okanoka Bhrama Bhavishyattu - ఒకానొక భ్రమ భవిష్యత్తు

Okanoka Bhrama Bhavishyattu - ఒకానొక భ్రమ భవిష్యత్తు

  • ₹40.00

అనువాదం: ఆనందేశి నాగరాజు

అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆలోచనా విధానాన్ని విశ్లేషించాలని భావించేవారు. అయితే, మనోవిశ్లేషణ పద్ధతి ద్వారా ఫ్రాయిడ్‌ ఆవిష్కరించిన మనస్తత్వమే అచేతన భావన.

                                                                                                         *

మనస్సులో కామవాంఛలతో సతమతమయ్యే వ్యక్తి ఆ కోరికల ఉదాత్తీకరణ ద్వారా పరమభక్తునిగా పూజాపునస్కారాలలో సదా మునిగి తేలవచ్చు! తననుతాను అల్పునిగా చేతగాని వానిగా భావించే వ్యక్తి ఇతరులపై పెత్తనం చెలాయించవచ్చు! మన మానసిక స్వరూపాన్ని ఫ్రాయిడ్‌ ఒక మంచు ఖండంగా అభివర్ణించాడు.

                                                                                                        **

చిన్నతనం నుండి కుటుంబసభ్యులతో సంబంధాల ప్రభావం, లైంగిక ఉద్దీపనలు, సమాజం మనపై విధించిన విధి, నిషేధాలు మన సహజాత ప్రవృత్తులను అణచివేసి అచేతనలోకి నెట్టివేస్తాయి. ఇలా అణచివేయబడిన భావాలే పరోక్షంగా వ్యక్తి ప్రవర్తనను నిర్దేశిస్తాయని ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణ పద్ధతి ద్వారా నిరూపించాడు.

                                                                                                        ***

మనోవిశ్లేషణ పద్ధతి ద్వారా మతవిశ్వాసాలపై ఫ్రాయిడ్‌ చేసిన అధ్యయనమే ''ఒకానొక భ్రమ భవిష్యత్తు''

(ఇస్లాంను కూడా కలుపుకోవాలి ఎందుకంటే క్రిష్టియన్‌, ఇస్లాం మతాల మూలాలు ఒక్కటే) అధ్యయనం చేశానన్నాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Okanoka Bhrama Bhavishyattu, ఒకానొక భ్రమ భవిష్యత్తు, సిగ్మండ్ ఫ్రాయిడ్, Sigmund Freud