Boumaneeyam|బౌమనీయం - ఆధునికత నుంచి ద్రవాధునికత దాకా

Boumaneeyam|బౌమనీయం - ఆధునికత నుంచి ద్రవాధునికత దాకా

  • ₹395.00

ప్రపంచీకరణలోని ఆధునికత దశను ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త జిగ్మంట్ బౌమన్ 'ద్రవాధునిక కాలం' అంటాడు. ద్రవాధునిక ప్రపంచం తనకడ్డు వచ్చేవాటిని మారుస్తూ, కరిగించుకొంటూ నిరంతర చలనంలో వుంటుంది. అంటీ ముట్టనట్టు వుండటాన్ని జీవనశైలిగా మార్చి ప్రేమలను డిస్పోజబుల్ చేసింది ఈ కాలం. పరిస్థితులు నిరంతరం మనల్ని తేలుస్తూ, ముంచుతూ అస్థిరంగా వుంచుతాయి. నిరంతరం పరుగులో వుంటూ మార్పుతో వుక్కిరిబిక్కిరి కావడం, ఆశ్చర్యపోవడం మన వంతు.

-భువనగిరి చంద్రశేఖర్, చిరస్మరణీయ న్యాయవాది

పల్లెలు ఖిలమౌతున్నాయనీ, నగరాలు పుచ్చిపోతున్నాయనీ విచారిస్తూనే, భద్రతాభావం పుష్కలంగా వుండే పల్లెల్ని వదలిపెట్టి నగరాలకొచ్చే, అభద్రతలో కునారిల్లే ఆధునిక మానవుడి విరోధాభాసను బౌమన్ శాస్త్రీయంగా విశ్లేషించి చూపిస్తాడు. ఫేస్  బుక్ లూ, ట్విట్టర్ లూ లాంటివి మనుషులకున్న భయంలోంచే పుడుతున్నాయని హెచ్చరిస్తాడు.

-మధురాంతకం నరేంద్ర, కథకుడు, నవలాకారుడు

యిది నిజానికి అన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలకన్నా అసలైన, గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకం. మనచుట్టూ వున్న సామాజిక పరిస్థితుల్ని తెలుసుకోవడం వల్ల మన వ్యక్తిత్వం పూర్తిస్థాయిలో వికసిస్తుంది. యీ పని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చెయ్యవు. పైగా అవి ప్రతిదీ వ్యక్తులుగా సాధించుకోవచ్చనే వొక పెద్ద అబద్ధాన్ని, భ్రమనూ మనకు కల్పిస్తాయి. బౌమనీయం వ్యక్తులుగా మనం యెదుర్కొంటున్న సమస్యలకి సామాజిక వ్యవస్థల్లో వున్న మూలాల్ని వెతికి మనకు చూపిస్తుంది.

-దాము, కవి, చిత్ర దర్శకుడు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Boumaneeyam, బౌమనీయం, బి. తిరుపతిరావు, 9789393056153, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ

TOP