Eeviplavam Antarangamlo | ఈ విప్లవం అంతరంగంలో

Eeviplavam Antarangamlo | ఈ విప్లవం అంతరంగంలో

  • ₹295.00

జిడ్డు కృష్ణమూర్తి ఆధునిక తత్వవేత్తల్లో ఆద్యుడిగా ప్రపంచమంతా ప్రశంసలు పొందిన జ్ఞాని. ఇతడు 1895 మే 11న జన్మించాడు. 1986 ఫిబ్రవరి 17న మరణించాడు. తత్వం, మనస్తత్వం, సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికతపై వీరు రచనలు, ప్రసంగాలు చేశారు.

అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్దాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.

రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.

కరుణ కలిగి ఉండటం అంటే అన్నింటిపై ఆసక్తి కలిగి ఉండటం, కేవలం ఇద్దరు మనుషుల మధ్యే కాదు, సర్వమానవాళి, భూమిపై ఉండే అన్నింటిపై, జంతువులు మరియు వృక్షాలపై కరుణ కలిగి ఉండటం. అలాంటి కరుణ మనం కలిగి ఉంటే, ఈ రోజు మనం భూమిని ఎలా చెరుస్తున్నామో, అలా చెరచలేం. అలాంటి కరుణ మనం కలిగి ఉంటే, ఈ భూమి పై యుద్ధాలు ఉండవు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Ee viplavam Antarangamlo, ఈ విప్లవం అంతరంగంలో, జిడ్డు కృష్ణమూర్తి, Jiddu Krishnamurthy