Dukham Leni Desam| కబీరు దుఃఖంలేని దేశం

Dukham Leni Desam| కబీరు దుఃఖంలేని దేశం

  • ₹225.00

భారతీయ సాహిత్య చరిత్రలో కబీరు ఒక విశిష్ట సంఘటన అంటుంది ఎవిలిన్ అండర్ హిల్. గత అయిదువందల ఏళ్ళుగా కబీరు ఉత్తరభారతదేశాన్నంతటినీ గాఢంగా ప్రభావితం చేస్తూ వచ్చాడు. గురునానక్, రైదాసు, దాదూ, బుల్లేషా వంటి సంత్ కవులకే కాక, ఆధునిక భారతదేశంలో కూడా రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా వంటి ముక్తపురుషులకు, టాగోర్ వంటి విశ్వకవికీ, మహాత్మాగాంధి, అంబేద్కర్ వంటి సామాజిక దార్శనికులకు కూడా స్ఫూర్తిదాయకుడిగా ఉన్నాడు. వివిధ సంప్రదాయాలకు చెందిన కబీరు సాహిత్యంలోని వివిధ రచనల నుండి 305 సాఖీ, శబద్, రమైనీలను ఏరి కూర్చి తెలుగులోకి అనువదించి వాడ్రేవు చినవీరభద్రుడు అందిస్తున్న సంకలనమిది. తన సాధనలో, సాక్షాత్కారంలో తన అనుభవాల్ని, అనుభూతినీ కబీరు ఎప్పటికప్పుడు తన శ్రోతలతో పంచుకుంటూ వచ్చినందువల్ల ఈ కవిత్వం చదవడం కబీరు ఆత్మకథను చదవడంలాంటి అనుభవం కూడా.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Kabir Dukham Leni Desam, కబీరు దుఃఖంలేని దేశం, వాడ్రేవు చినవీరభద్రుడు, Vadrevu Chinaveerabhadrudu, 9789393056146, Analpa, అనల్ప