Gudavalli Ramabrahmam | గూడవల్లి రామబ్రహ్మం

Gudavalli Ramabrahmam | గూడవల్లి రామబ్రహ్మం

  • ₹160.00

    ₹200.00

అభ్యుదయ చలనచిత్ర రథసారధి

“పూజ్యులు, పితృతుల్యులు శ్రీ గూడవల్లి రామబ్రహ్మంగారు తీసిన ’మాయలోకం’ (1945)లో నేను రాకుమారుడిగా నటించాను. ఐతే, ఆ వేషం వుందని తెలిసి ప్రయత్నించడానికి వెళ్ళినపుడు నాకేమీ తెలీదు. నమస్కారం పెట్టాలన్న కనీససంస్కారం కూడా తెలియనివాడిని. నన్ను పంపిన ఘంటసాల బలరామయ్యగారిని ”ఎవడయ్యా వీడు?” అని అడిగితే, ”మీ వాడే” అన్నారాయన. అంటే ’మీ కులం వాడే’నని సూచన. “అందుకేనా అంత...” అన్నారు రామబ్రహ్మంగారు అంత పొగరు నాకుందన్నట్టు! ”పల్లెటూరివాడు, పద్ధతులు తెలియవు. కాని మంచి కుర్రాడు. వృద్ధిలోకి రావలసిన వాడు” అని నా గురించి పెద్దలు చెప్పడంతో – రామబ్రహ్మంగారు నాకు ఆ వేషం ఇచ్చారు. అలా ఆయన దగ్గర చేరాను. క్రమేణా నాపట్ల ఆయనకి వాత్సల్యం కలిగింది. ప్రేమగా చూశారు. నన్ను తన ఇంట్లోనే పెట్టుకున్నారు. నాకు ఏం కావాలో అది పెట్టారు. నేను కుర్రాడిని గనక, నా ప్రవర్తన మీద ఒక కన్ను వేసి వుంచేవారు. రామబ్రహ్మంగారు గొప్ప సంస్కారి. ఆయన చూపిన వాత్సల్యాభిమానాలే నాకు పాఠాలైనాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను; తెలుసుకున్నాను. ఆయన ’మాలపిల్ల’, ’రైతుబిడ్డ’ వంటి సంచలన చిత్రాలు తీసిన గొప్ప దర్శకుడు. నా అదృష్టం వల్ల నేను ఆయన పెంపకంలో వుంటూ ’మాయలోకం’, ’పల్నాటియుద్ధం’ చిత్రాల్లో నటించాను. పెద్దవారి ప్రోత్సాహం, పెంపకం, ఆదరణా లభించకపోతే ఏ వ్యక్తీ ఉన్నత స్థానం పొందలేడు. నేను ఎప్పుడూ ఆయన్ని దర్శకుడిగా చూడలేదు. తండ్రిగా చూశాను. నన్ను ఆయన కొడుకులా చూశారు. వారి ఆశీస్సులు, అభిమానాదరాలే నాకు రక్షగా ఎంతో నిలబడ్డాయి.

అటువంటి గొప్ప దర్శకుడి జీవితకథను వివరిస్తూ పుస్తకం రావడం ఎంతో సంతోషం. పుస్తకాన్ని వెలువరిస్తున్న రచయితను, ప్రచురణ కర్తలను అభినందిస్తున్నాను!”

- అక్కినేని నాగేశ్వరరావు


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Gudavalli Ramabrahmam, గూడవల్లి రామబ్రహ్మం, టి. ఎస్. జగన్మోహన్, T.S.Jaganmohan