Telugu Cinema Sahityam|తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం
- Author:
- Pages: 406
- Year: 2019
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: V-Tech Publications|వీ-టెక్ పబ్లికేషన్స్
-
₹300.00
తెలుగుసినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం పుస్తకం ప్రముఖ తెలుగు సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రాసిన సిద్ధాంత గ్రంథం. ఈ గ్రంథంలో తెలుగు సినిమాలలోని కథ, కథనం వాటి శిల్పాలను సప్రమాణికంగా చర్చించారు.
ఈ గ్రంథంలో తెలుగు సినిమాలో కథాసాహిత్యాన్ని, కథనాన్ని, శిల్పాన్ని వేరువేరు అధ్యాయాలుగా విభజించి చర్చించారు. సాధారణంగా సినిమా ప్రారంభమైన అరగంటలో ప్రధాన పాత్రలను, పాత్రల మనస్తత్త్వాలను పరిచయం చేసి, 30-35నిముషాల నడుమ సినిమాలో కథానాయకుడు(ప్రొటోగనిస్ట్) సాధించాల్సిన సమస్యను సృష్టించి, విశ్రాంతికి ముందు కథను మలుపుతిప్పి, సినిమా పూర్తయ్యే ముందు కథానాయకుడు పూర్తిగా దెబ్బతిన్న స్థితికి తీసుకువెళ్ళి చివరకు విజయాన్ని సాధించడం అనే తరతరాలుగా తెలుగు సినీరంగాన్ని ఏలుతున్న సిద్ధాంతాన్ని కొన్ని ఉదాహరణలతో వివరించారు. సినిమాలో సన్నివేశాలను, ఘట్టాలను నిర్వచించి వాటి భేదాలు నిరూపించడం, సినిమా రచన శిల్పంలో భాగంగా సంభాషణను అవసరమైనచోట సంభాషణలు, మౌనం అవసరమయ్యేచోట మౌనం సినీదర్శకులు, రచయితలు ఎలా సృష్టిస్తారో వివరించారు. ఏ సన్నివేశాల్లో ఏ వివరాలు ప్రేక్షకుల అవగాహన మీద నమ్మకం ఉంచి వదిలేస్తూంటారు, మరి ఏ వివరాలను పాత్రలతో పలికిస్తూంటారు వంటి సూక్ష్మమైన విషయాలను తెలుగు సినిమా క్లాసిక్స్‌ను ఉపయోగించి తెలిపారు.
* కధారచన అనేది ఒక రహదారి అయితే దానిమీద నడిచే మొదటి బాటసారి సంభాషణ రచయిత.
* సాహితీ కధ చదువుతారు. సినిమా కధ చూస్తారు.
* కధాంశం ఇతివృతంగా ఎదిగే పద్దతిలో రచయిత కధ విషయంలో ఈ రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
* పాత్రలు చుట్టూ కధ అల్లబడే ముందు ఆ పాత్రకు సంబంధించిన ఈ కింది విధంగా 33 రకాలుగా విశ్లేషించుకోవాలి.
* సాహిత్య కధ చదువుకున్న వాళ్ళకు పరిమితం. సినిమా కధ చదువుకున్న వాళ్ళతో పాటు అవిద్యావంతుల్ని కూడా అలరిస్తుంది.
* ఎన్.టి.ఆర్. తో సర్దార్ పాపారాయుడు తీసిన దాసరి, అక్కినేనితో ప్రేమాభిషేకం తీసాడు తప్ప బొబ్బిలిపులి తియ్యలేదు. ఎందుకని?
* సినిమా సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన నూతన రచయిత ముఖ్యంగా ఈ ఏడు ప్రత్యేక లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి.
* పాతాళబైరవి లక్షంగా పదవైచిత్రి, సంఘటనా శిల్పం !
* మల్లీశ్వరి లక్ష్యంగా కదన లక్షణం !
* మాయాబజార్ లక్ష్యంగా కధనశిల్పం లక్షణం !
* ఖైదీ చిత్రం ఏకవాక్య దృశ్యమాలిక !
* The purpose of the scene is to move the story forword!
* The hardest thing about writing is knowing what to write!
Tags: తెలుగు సినిమా సాహిత్యం, కథ, కథనం, శిల్పం, పరుచూరి గోపాలకృష్ణ, వీ-టెక్ పబ్లికేషన్స్