Olga Nunchi Gangaku | ఓల్గా నుంచి గంగకు

Olga Nunchi Gangaku | ఓల్గా నుంచి గంగకు

  • ₹250.00

ఆయన నిత్యసంచారిగా తన జీవితంలో సగానికి పైగా కాలాన్ని ఇంటికి సుదూరమైన ప్రాంతాలను సందర్శిస్తూ గడిపారు. ఆయన భ్రమణకాంక్ష భారతదేశంలోని లడఖ్, కిన్నౌర్, కాశ్మీర్ వంటి వైవిధ్యభరితమైన ప్రాంతాలకు, విదేశాలైన నేపాల్టిబెట్శ్రీలంకఇరాన్చైనా, ఆనాటి సోవియట్ రష్యా వంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళింది. ఎన్నో ఏళ్ళపాటు బీహార్ రాష్ట్రానికి చెందిన శరణ్ జిల్లాలోని పర్శ గధ్ గ్రామంలో గడిపారు. దానికి గుర్తుగా ఆ గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామ ద్వారానికి రాహుల్ గేట్ అని పేరుపెట్టారు. ప్రయాణించేప్పుడు వీలున్నంత వరకూ ఉపరితల రవాణాపైనే ఆధారపడ్డారు. ఆయన పలు ప్రదేశాల గురించి తెలుసుకునే జిజ్ఞాసతో ప్రయాణించారు. పదమూడో శతాబ్దంలో నలందవిక్రమశిల విశ్వవిద్యాలయాలను భక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు పవిత్రమైన గ్రంథాలతో పారిపోయారనీ, ఆ విలువైన సంస్కృత పుస్తకాల్ని టిబెట్‌లోని ఆరామాల్లో భద్రపరిచివుంచారనీ ప్రచారంలో ఉంది. అయితే, ఆరు వందల ఏళ్లుగా వాటిల్లో ఏముందో చూసినవారు లేరు. సాంకృత్యాయన్ వాటికోసం అన్వేషిస్తూ, దారి కూడా సరిగాలేని కొండల్లో నడుస్తూ, కాశ్మీర్, లడఖ్, కార్గిల్ మీదుగా టిబెట్ వెళ్లారు. అక్కడ పుస్తకాలైతే లభించాయిగానీ అవి సంస్కృతంలో లేవు. అన్నీ భోటి భాషలో ఉన్నాయి. రాహుల్జీ కంచరగాడిదల మీద వాటిని తరలించుకొచ్చారు. ఆ గ్రంథాలన్నీ పాట్నా మ్యూజియంలో ఉన్నాయిప్పుడు. మరో మూడుసార్లు టిబెట్ వెళ్లారు. టిబెటన్ నేర్చుకున్నారు. నేర్చుకోవడమేకాదు దాని వ్యాకరణ పుస్తకాలు రాశారు. టిబెటన్-హిందీ నిఘంటువు కూర్చారు. నాటి సోవియట్‌ యూనియన్‌లోని అనేక రిపబ్లిక్కులలో ఆయన విస్తృతంగా పర్యటించి, సంస్కృతంపాళీ భాషలో లిఖించబడిన అనేక శాసనాలను, రాతిఫలకాలనూ కనుగొన్నాడు. భారతదేశంలోనూనేపాల్‌, హిమాలయ సానువులలోనూ, టిబెట్‌ లోనే కాకుండా ఆయన మంగోలియాఆఫ్ఘనిస్తాన్‌ ఆదిగా అనేక దేశాలలో విస్తృతంగా పర్యటించాడు. తన యాత్రలో భాగంగా అరుదైన ”కాన్జూర్, టాన్జూర్, గ్రంథాలను కొన్నాడు 130 వర్ణ చిత్రాలు 1600 కు పైగా వ్రాత ప్రతులు సేకరించారు. యాత్రికుడు యుఁవాన్‌ త్స్యాంగ్‌ తర్వాత ఇంత భారీగా సేకరించిన వారెవరు లేరని చరిత్ర కారుల అంచనా.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Olga Nunchi Gangaku, ఓల్గా నుంచి గంగకు, రాహుల్‌ సాంకృత్యాయన్‌‌, Rahul Sankruthyayan,