Prajala Maniṣi | ప్రజల మనిషి

Prajala Maniṣi | ప్రజల మనిషి

  • ₹90.00

వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, ప్రచారకుడు. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.

వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి నవలను తెలంగాణా సాయుధ పోరాటానికి పూర్వరంగం నేపథ్యంలో రాశారు. తెలంగాణా సాయుధ పోరాటంలో వ్యక్తిగతంగా పాల్గొని, సుదీర్ఘమైన జైలు జీవితాన్ని గడిపిన ఆళ్వారు స్వామి తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యం, సాగిన వైనం, తదనంతర పరిణామాలు ప్రతిబింబిస్తూ తెలంగాణా జన జీవితాన్ని నవలల్లో చిత్రీకరిద్దామని ప్రయత్నించారు. ఆ క్రమంలో రాసిన మొదటి నవల ప్రజల మనిషి 1938లో తెలంగాణా ప్రాంతంలో రాజకీయ చైతన్యం పొడడసూపుతున్న కాలం వరకూ సాగుతుంది. ఐతే తర్వాతి నవల గంగు తెలంగాణా సాయుధ పోరాట కాలాన్ని చిత్రీకరించగా, చిన్నవయసులోనే ఆళ్వారుస్వామి మరణించడంతో తన నవలా ప్రణాళిక కూడా ఆగిపోయింది. ఐతే ఈ ప్రణాళికనే స్వీకరించి దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్ళుమోదుగుపూలుజనపదం అన్న నవలలు రాశారు.

ప్రజల మనిషి నవల తెలంగాణా తొలి నవల అన్న ప్రత్యేకతను స్వంతం చేసుకుంది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: తెలంగాణా తొలి నవల, తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యం, ప్రజల మనిషి, Prajala Maniṣi, వట్టికోట ఆళ్వారుస్వామి, Vattikota Alwar Swamy