Ramudiki Sita Emavutundi | రాముడికి సీత ఏమవుతుంది

Ramudiki Sita Emavutundi | రాముడికి సీత ఏమవుతుంది

  • ₹60.00

రాముడికి సీత ఏమవుతుంది పుస్తకం ప్రముఖ రచయిత ఆరుద్ర వ్రాసిన పరిశోధనా రచన. ఈ పుస్తకం పరిచయంలో ఇలా ఉంది. ప్రపంచ మహాకావ్యాలలో రామాయణానిదే అగ్రతాంబూలం. "రాముడికి సీత ఏమవుతుంది" అన్న ప్రశ్న ద్వారా ఏమైనా గందరగోళం ఉత్పన్నమయితే అది ఆరుద్ర కల్పించినది మాత్రం కాదు. "రామాయణం రంకు" అనే సామెత జనం నోట నానుతూ మన విశ్వాసాలను ఎక్కిరిస్తుంది. సీత "జానకి" కాదా? భూకన్య అని ఎలా వచ్చింది? పురాణాలు, ఇతిహాసాలు, మహాకావ్యాలు రామాయణంలోని వావివరసలను ఎందుకు మార్చేస్తూ వచ్చాయి? ఇలాంటి చిక్కుముడులను విప్పుకుంటూ సంగతి బిగుసుకుపోకుండా "ఓపెన్ డిస్కషన్" చేశారు అరుద్ర.

వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రామాణికంగా ఉన్ననూ, వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలలో రామాయణ కథను వాల్మీకి రాసిన రామాయణం కంటే వేరుగా రాశారు. కొన్ని రామాయణాలలో సీత రాముడికి చెల్లెలు అని వ్రాసి ఉంది, కొన్ని రామాయణాలలో సీత రాముడికి చెల్లెలు & భార్య అని కూడా వ్రాసి ఉంది. ఖోటా రామాయణంలో సీత రామలక్ష్మణులకిద్దరికీ భార్య అవుతుంది. ఈ రామాయణ రచనల వలన మనకు అప్పుడప్పుడు అప్పటి కాలమాన పరిస్థితులను తెలుపుతుంది. ఆరుద్ర ఈ పుస్తకం ద్వారా మనకు అలా రకరకాల ప్రాంతాలలో చలామని అవుతున్న రామాయణాలలో కొన్ని రామాయణాలను పరిచయం చేస్తాడు.

ఈ పుస్తకంలో ఉన్న వివిధ అధ్యాయాల పేర్లు కొన్ని - నిప్పు లేనిదే పొగ రాదు, బౌద్ధ వాఙ్మయంలో రామ కథలు, ఖోటాన్ రామాయణం, లావోస్ లోని రామకథలు, సయాంలో రామకీర్తి కావ్యం, మలేషియాలో మండోదరి కథ, సీత పుట్టుక లంకకు చేటు, హనుమంతుడు ఎవరి కుమారుడు, హనుమంతుడు ఎవరి ద్వారా పాలకుడు, జైన వాఙ్మయంలో తొలి వావివరుసలు, జైన రామాయణాలలో విరుద్ధ విషయాలు, పెట్టెలో దొరికింది ఎవరు, సీత జనయిత్రి కూడా బ్రహ్మ జ్ఞాని, స్త్రీల రామాయణాలలో చిత్ర విచిత్ర విషయాలు, సీతకు ఎంతమంది సవతులు?, ఋగ్వేదంలో సీతారామలక్ష్మణులు, సీతా రామాంజనేయులు ఎవరై ఉంటారు, రాముడే బలరాముడా, సీత ద్రౌపదిగా పుట్టిందా, ఏరువాక పున్నమి సీతా యజ్ఞమా, "ఇంటికి జ్యేష్ట, పొరుగుకు శ్రీమహాలక్ష్మి", సీతాయాశ్చరితం మహాత్. ఇవే కాకుండా రచయిత విస్తారంగా సంప్రదించిన గ్రంథాలను ఉట్టంకించాడు


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Ramudiki Sita emavutundi, రాముడికి సీత ఏమవుతుంది, Arudra, ఆరుద్ర