Palagummi Padmaraju Rachanalu-3 Navalalu | పాలగుమ్మి పద్మరాజు రచనలు-3 నవలలు
- Author:
- Pages: 291
- Year: 2010
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹150.00
బ్రతికిన కాలేజి | చచ్చి సాధించాడు | భక్త శబరి | చచ్చిపోయిన మనిషి
పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, (జూన్ 24, 1915 - ఫిబ్రవరి 17, 1983) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన గాలివాన కథా రచయిత.హేతువాది .ఎం.ఎన్.రాయ్ భావాల ప్రచారకుడు.
పద్మరాజు జూన్ 24, 1915 న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలములోని తిరుపతిపురంలో జన్మించాడు. ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడ లోని పీ.ఆర్.ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా పనిచేశాడు.
తన జీవిత కాలములో ఈయన 60 కథలు, ఎనిమిది నవలలు, ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు, నాటకాలు రచించాడు. ఈయన వ్రాసిన 60 కథలు గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. పద్మరాజు 23 యేళ్ళ వయసులో తన మొదటి కథ సుబ్బిని వ్రాశాడు. ఈయన ఎన్నో కథలు వ్రాసినా వాటిలో బాగా పేరుతెచ్చిన కథ గాలివాన. ఈ కథ 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎంపికయిన ఈ పోటీలో భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. గాలివాన ప్రపంచములోని అనేక భాషాలలోకి అనువదించబడింది. ఈ విధముగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన ఘనత ఈయనకే దక్కినది.
Tags: Palagummi Padmaraju Rachanalu- 3 Navalalu, పాలగుమ్మి పద్మరాజు రచనలు-3 నవలలు, Palagummi Padmaraju, పాలగుమ్మి పద్మరాజు