Bucchibabu Sahitya Vyasalu-2 | బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు-రెండవ సంపుటం
- Author:
- Pages: 245
- Year: 2016
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹150.00
ఆంగ్ల రచయితలపై వ్యాసాలు
ఆయన ఏలూరులో శివరాజుసూర్య ప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు జూన్ 14, 1916 న జన్మించాడు. అక్షరాభ్యాసం కంకిపాడులో జరిగింది. పాలకొల్లులో ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్, బి.ఏ. పట్టాలు గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివారు. 1937 చివరలో డిసెంబరు, మార్గశిర మానంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇవ్వనపాడు గ్రామానికి చెందిన ద్రోణంరాజు సూర్యవకాశరావుగారు గారి రెండవ కుమార్తె సుబ్బలక్ష్మితో ఆయన వివాహం జరిగింది. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. ఆనర్సులో ఉత్తీర్ణులై, నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఎం.ఏ. పట్టా పొందారు. ఈయన కొన్నాళ్ళు అనంతపురం, విశాఖపట్నంలలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1945 నుండి 1967లో మరణించేవరకు ఆలిండియా రేడియోలో పనిచేశాడు.
బి.ఏ. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ కళాశాల వార్షిక సాహిత్య సంచికలో (1936) వీరి ప్రప్రథమ రచనలు - 'జువెనిలియా', 'బ్రోకెన్ వయోలిన్' అనే ఆంగ్ల కవితలు, 'పశ్చాత్తాపం లేదు' అనే తెలుగు కథానిక ప్రచురించబడ్డాయి.
ఈయన ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. ఈయన వ్రాసిన చిన్న కథలు సాధారణంగా చాలా పొడవుగా ఉండి, పాత్ర చిత్రణలోనూ, కథ నెరేషన్లో విన్నూతమైన శైలి కలిగి ఉంటాయి. బుచ్చిబాబు ఆలోచనా స్రవంతిపై సోమర్సెట్ మామ్, ఓ హెన్రీ తదితర ఆంగ్ల రచయితల ప్రభావం మెండుగా కనిపిస్తుంది. కొన్ని నవలలే వ్రాసినా మంచి నవలా రచయితగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు రచయితలు, కవులందరూ జాతీయవాదులు, మార్క్సిస్టులు లేదా ఏదో ఒక సంఘసంస్కరణ ఉద్యమానికి చెందిన వారైన కాలంలో అతికొద్ది మంది ఆధునిక అభ్యుదయ రచయితల్లో బుచ్చిబాబు ఒకడు.
Tags: Bucchibabu Sahitya Vyasalu-2, బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు రెండవ సంపుటం, Bucchibabu, బుచ్చిబాబు, ఆంగ్ల రచయితలపై వ్యాసాలు