Moodu Beerla Tarvata | మూడు బీర్ల తర్వాత
- Author:
- Pages: 150
- Year: 2019
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Chaaya Resources Center-ఛాయా రిసోర్సెస్ సెంటర్
-
₹170.00
అక్కిరాజు భట్టిప్రోలు అనే సాఫ్ట్వేర్ నిపుణుడు ఉన్నట్లుండి ఒక రోజున నేనో కథ రాశాను అంటూ ప్రకటించాడు. ప్రపంచంలో అందరూ పురుగులే అని అంతరాంతరాల్లో నిర్ధారించుకున్న ఒక సాఫ్ట్వేర్ నిపుణుడు ఒకానొక ఆఫీసు పార్టీలో మూడు బీర్లు ముగించి నాలుగో సీసా తెరిచాక అతని బాహ్య ప్రవర్తనకూ, అంతశ్చేతనకూ మధ్య వైరుధ్యాలు కరిగిపోయిన వృత్తాంతం, మూడు బీర్ల తరువాత అనే ఆ కథ. అతని కథానాయకుడి మీద నాకు పెద్ద సానుభూతి లేకపోయినా, అక్కిరాజు మొదటి కథ, మొదటి కథలా అనిపించలేదు. కథ చదివించింది; సంభాషణలు, నిర్మాణం, శైలి బాగున్నాయి. ఇతను రాయగలడు, మంచి ఇతివృత్తాలను ఎన్నుకుంటే ఇతని వద్ద నుంచి మంచి కథలను ఆశించవచ్చు అనిపించింది.
- డా|| జంపాల చౌదరి
Tags: Moodu Beerla Tarvata, మూడు బీర్ల తర్వాత, Akkiraju Bhattiprolu, అక్కిరాజు భట్టిప్రోలు