Viswadarsanam-Paschatyachintana |  విశ్వదర్శనం-పాశ్చాత్యచింతన

Viswadarsanam-Paschatyachintana | విశ్వదర్శనం-పాశ్చాత్యచింతన

  • Author: నండూరి రామమోహన రావు | Nand,uri Rama Mohan Rao
  • Pages: 520
  • Year: 2017
  • Book Code: Paperback
  • Availability: 2-3 Days
  • Publisher: Victory-విక్టరీ
  • ₹250.00

తత్వ శాస్త్రాధ్యయనం వల్ల ప్రయోజనం ఏమిటి? భౌతికశాస్త్రాలు అతివేగంగా పురోగమిస్తూ, మానవ జీవిత విధానాన్ని మార్చివేస్తున్న ఈ కాలంలో ఎవరికి కావాలి తత్వమీమాంస అని కొందరు ప్రశ్నించవచ్చు. ఇది అనాలోచిత వైఖరి, తత్వజిజ్ఞాస మానవ నాగరికతకే పునాది వంటింది. వివిధ కాలాలలో ప్రజల మత, సాంఘీక, నైతిక, రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధల మీద, విశ్వాసాల మీద ఆయా కాలల నాటి తత్వవేత్తల ప్రభావం ఎంతో ఉన్నది.

ఈ రచన ఫ్రౌఢ నిర్బర వయ: పరిపాకంలో ఉన్నవారినే కాక, యువతరం దృష్టిని కూడా ఆకర్షించగలదని ఆశపడుతున్నాను. తత్వశాస్త్రాధ్యయనం చేసిన వ్యక్తి మనస్సు మరింత పరిణతం, మేధ మరింత నిశితం. హృదయం మరింత విశాలం అవుతాయని నాకు అనిపిస్తున్నది.

విల్‌డ్యూరాంట్‌ తన 'ప్లెజర్స్‌ ఆఫ్‌ ఫిలాసఫీ'లో పేర్కొనట్టు తత్వశాస్త్రాధ్యయనంలో ఒక అనిర్వచనీయానందం కూడా ఉన్నది. అధ్యయనానంతరం పఠిత తనకు తానుగా, పూర్తిగా తనదే అయిన ఒక నూతన జీవిత దృక్పధాన్ని ఏర్పరచుకొనగల శక్తిని సముపార్జించు కోగలడని నాదొక నమ్మకం.

ప్రపంచ మేధావుల మన:కుహరాంతరాలలోనికి, వారి మనో వాల్మీకాలలోనికి, వారు సృష్టించిన మంత్రనగరి సరిహద్దులలోనికి ఈ సాహసయాత్ర కొలంబస్‌ అమెరికాఖండ యాత్రకు, ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రలోక యాత్రకు తీసిపోదు. ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా పాఠకులను ఆహ్వానిస్తున్నాను.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Viswadarsanam, Paschatyachintana, విశ్వదర్శనం, పాశ్చాత్యచింతన, నండూరి రామమోహన రావు, Nand, uri Rama Mohan Rao, తత్వశాస్త్రం