Sankara Vijayam  |  శంకరవిజయం

Sankara Vijayam | శంకరవిజయం

  • Author: నేతి సూర్యనారాయణ శర్మ | Neti Suryanarayana Sarma
  • Pages: 360
  • Year: 2020
  • Book Code: Paperback
  • Availability: 2-3 Days
  • Publisher: VVIT
  • ₹350.00

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.


దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే

స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః

దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు.

కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః

శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా

శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. 


హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు.  శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Sankara Vijayam, శంకరవిజయం, Neti Suryanarayana Sarma, నేతి సూర్యనారాయణ శర్మ,