Jashuva Rachanalu-Gabbilam | జాషువ రచనలు-గబ్బిలం

Jashuva Rachanalu-Gabbilam | జాషువ రచనలు-గబ్బిలం

  • ₹40.00

జీవిత కృతి - 'గబ్బిలం'

కవి శక్రేశుడు గండపెండెరములన్ గాంగేయ తీర్థంబులన్

వివిధోపాయన సత్కృతుల్ గొనిన గాంధీ శాంతి సిద్ధాంత మా

ర్థవ మార్గటుడు గబ్బిలంబులకు దౌత్యంబుల్ ప్రబోధించు మా

నవతా స్రష్టన్ నవ్యభావ చతురుండన్ జాషువాభిఖ్యుడన్ 

జాషువా తన గురించి చెప్పుకున్న పద్యమిది. కవులు, రచయితలు తాము ఎన్ని రచనలు చేసినా, వాటిలో తమకు నచ్చిందీ, ప్రజలు మెచ్చిందీ, ఆ కవికి లేక రచయితకు కీర్తి ప్రతిష్టలు గడించి పెట్టిందీ అయిన రచనలు సాధారణంగా ఒకటో, రెండో ఉంటాయి. అలాంటి రచనల్నే 'జీవిత కృతులు' (Life Works) అని అంటాం. ఆ కవి భావనా సర్వస్వం, కవితా శిల్ప సౌందర్యం సమస్తం, గుత్తకు కొన్న కావ్యం అదే అయి ఉంటుంది. జాషువా ఇంచుమించు ముప్ఫై పై చిలుకు గ్రంథాలు రచించాడు. సర్వ పండితామోదముగా రచియించితిని (వి) ముప్పది కావ్యములు (నా కథ-158). అయినా ఆయన ఆమరణాంతం చెప్పుకున్న కావ్యం "గబ్బిలమే". ప్రజలు మెచ్చి ప్రశంసించిందీ "గబ్బిలాన్నే". అందువల్లే, 'గబ్బిలం' జాషువా జీవిత కృతి. అంతేకాదు, ఆయన రచనలల్లోనే అది 'శిరశ్శేఖర కృతి' (Monumental work) కూడా! జాషువా మిగిలన రచనలన్నీ ఒక ఎత్తు, 'గబ్బిలం' ఒక్కటీ ఒక ఎత్తు. జాషువా జీవిత ప్రస్థానానికీ, సామాజిక దర్శనానికీ నిదర్శనంగా నిలిచేది ఈ 'గబ్బిలం' కావ్యం.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: జాషువ రచనలు-గబ్బిలం, Jashuva Rachanalu-Gabbilam, Gurram Jashuva, గుఱ్ఱం జాషువా