Neramu Siksha | నేరము శిక్ష
- Author:
- Pages: 382
- Year: 2010
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹280.00
అనువాదం: శివమ్ | Sivam
టాల్స్టాయితో కలుపుకుని రష్యన్ సాహిత్య స్వర్ణయుగం నాటి ప్రముఖ రచయితగా పేరు గాంచిన దాస్తొయెవ్స్కీ (Fyodor Dostoyevsky) చెకోవ్, హెమింగ్వే లాంటి రచయితలను నీషే, సార్త్రే లాంటి తత్వవేత్తలను విశేషంగా ప్రభావితం చేసారు.
19 వ శతాబ్దపు రష్యన్ సామాజిక, రాజకీయ, నైతిక సంఘర్షణల నేపథ్యంలో మానవ సంబంధాలు, మనస్తత్వాలు, మానసిక విశ్లేషణలతో కూడిన రచనలు చేసిన దస్తయేవస్కీ “క్రైమ్ అండ్ పనిష్మెంట్” ( Crime and Punishment ) “బ్రదర్స్ కరమొజొవ్” ( The Brothers Karamazov ) లతో ప్రపంచ ప్రసిద్ధి గాంచారు. “బ్రదర్స్ కరమొజొవ్” నవల అత్యంత విశిష్టమైన రచన అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చే ప్రశింసబడింది.
విశిష్టమైన మనస్తత్వవేత్త (psychologist ), తత్వవేత్త (philosopher) అయిన దస్తయేవస్కీ మానవ హృదయపు లోతుల్ని, సంక్లిష్టాలని తన రచనల్లో ప్రతిభావంతంగా చిత్రించారు. దస్తయేవస్కీ రచనలు ప్రపంచ భాషలెన్నింటిల్లోకో అనువదించబడి (170 languages) కోట్లాది కాపీలు అమ్ముడుబోయి ప్రాచుర్యం పొందాయి.
Tags: Neramu Siksha, నేరము శిక్ష, దాస్తొయెవ్స్కీ, Fyodor Dostoyevsky