Satha Vasanthala Telugu Katha | శత వసంతాల తెలుగు కథ
- Author:
- Pages: 553
- Year: 1974
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹450.00
తెలుగు కథకు శ్రీకారం చుట్టిన శ్రీ గురజాడ అప్పారావుగారి కాలం నుంచీ ఈనాటివరకూ వచ్చిన కొన్ని వేల కథలలో ఉత్తమ కథలను ఎన్నిక చేసి ప్రచురించాలనే సంకల్పం కలిగినా, ఆ కోరిక 1974 వ సంవత్సరానికి గాని తీరలేదు. ఆ నాటి ఆ కథా సంకలనాన్ని పునర్ముద్రించమని అనేకమంది రచయితల, పాఠకుల అభీష్టం మేరకు కొద్ది మార్పులు, చేర్పులతో తిరిగి ఆనాటి ఆణిముత్యాన్ని అందిస్తున్నాం.
ఆంధ్రుల సామాజిక, ఆర్థిక, కుటుంబ జీవనంలో గత వంద సంవత్సరాలలో వచ్చిన మార్పులకు ఈ కథా సంకలనం అద్దం పడుతుంది.
లాటిన్ అమెరికన్ కవి పాబ్లో నెరుడా అన్నట్లు - కవితలు, కథలు అభాగ్య సోదరుల కన్నీరు తుడిచే చేతిగుడ్డలు కావాలి; వారి పోరాటాలకు సాధనాలుగా కత్తులు లాంటి కథలు కావాలి.... 'రుమాళ్ళుగా, సవాళ్ళుగా, ఎర్రెర్రటి జెండాలు''గా ఆ కథా సంకలనాన్ని స్వీకరించి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ శత వసంతాల తెలుగు కథను పాఠకులకు సగర్వంగా అందిస్తుంది.
గురజాడ వారి 'దిద్దుబాటు'తో మొదలై, పంతుల శ్రీరామశాస్త్రి గారి 'కిల్లీ దుకాణం'తో ముగిసిందీ సంకలనం. మధ్యలో మొదటి బహుమానము (చింతా దీక్షితులు), కలుపుమొక్కలు (శ్రీపాద), ఓ పువ్వు పూసింది (చలం), టార్చిలైటు (కరుణకుమార), వెండి కంచం (మునిమాణిక్యం), రంగవల్లి (మల్లాది రామకృష్ణ శాస్త్రి ), నువ్వులూ - తెలకపిండీ (కొడవటిగంటి కుటుంబరావు), చరమరాత్రి (శ్రీశ్రీ), ధర్మవడ్డీ (గోపీచంద్), కరణం కనకయ్య వీలునామా (పాలగుమ్మి పద్మరాజు), బల్లకట్టు పాపయ్య (మా.గోఖలే), నవ్వు (తిలక్), వర్షం (రావిశాస్త్రి ) వంటి ప్రాచుర్యం పొందిన, ప్రసిద్ధి వహించిన కథలు ఉన్నాయి. ఇంకా, తెలుగులో చిన్న కథకి అసలు సిసలైన నమూనాగా చూపదగిన - వెధవ డబ్బు (పాలంకి వెంకట రామచంద్రమూర్తి), ఆత్మీయత (అందే నారాయణ స్వామి), జ్యేష్ఠుడు (వియస్.అవధాని), బళ్ళోకి వెళ్లాలి (జమదగ్ని), జీవిక (వేలూరి సహజానంద), తొగరు చెట్టు (అంగర వెంకట కృష్ణారావు) వంటి కథలు ఉన్నాయి. చక్రపాణి గల్పిక 'అహం బ్రహ్మాస్మి'