Telugu Sogasulu | తెలుగు సొగసులు
- Author:
- Pages: 128
- Year: 2018
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Sri Publications-శ్రీ పబ్లికేషన్స్
-
₹100.00
తెలుగోడు మాటకట్టుతో వాడి చమకం ఉండాలి. కుదుపులు లేని తారు బాటలా దూది పింజెలాంటి తేలిక మాటలు లేకుంటే తెలుగోడు ఒప్పుకోడు. నుడికరం అలంకారం వెటకారం లయ తెలుగోడికి నోరు పెగలదు. మాటల కలగలుపుకు యాస తోడు అయి వినకుల చెవులకు విందు చేసే సవ్వడుల మాలె తెలుగు నుడి. తెలుగులు కానీ వారికీ సయితం వినటానికి ఇంపుగా ఉండే తేనెల తీయటి మాటల సొబగులు తెలుగు సొంతం. సామెతలు జాతీయాలు నుడుపులు పొడుపులు చాటవలూ మాట కట్టులు జోడు పలుకులు ఉత మాటలు ఊపు ఒత్తులు ఇలా ఒకటి అని ఏముంది? నుడిని ఎన్ని రకాలుగా ఎన్ని ఒంకాలు తిప్పి ఎంత నేర్పుగా వాడటానికి వీలు అవుతుందో తెలుగు వాడి దగ్గరే ఎవరైనా నేర్చు కోవాలి. తెలుగు నుడిలో ఉన్న లయ గమకం తీపి సొగసు సోయగాలకు గోరంత పొగరును కూడా కలిపి ఆ కమ్మదనాన్ని ఒక దగ్గర కుప్పగా పోస్తే అదే మీ చేతిలో ఉన్న ఈ తెలుగు సొగసులు.
- డాక్టర్ పమిడి శ్రీనివాస తేజ
Tags: Telugu Sogasulu, తెలుగు సొగసులు, డాక్టర్ పమిడి శ్రీనివాస తేజ, Dr Pamidi Srinivas Teja