Sri Ramayanam | శ్రీ రామాయణం
- Author:
- Pages: 268
- Year: 2019
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: VVIT
-
₹150.00
రామాయణాన్ని కాచి, వడపోసి సారాన్ని పిండగల శక్తి నాకు లేదని తెలుసు. ఇతిహాసాన్ని కొత్తకోణం నుంచి చూడగల దృష్టి లేదు. చెట్టుచాటు నుంచి వాలిని రాముడు చంపడం న్యాయమా, విభీషణుడిని చేరదీసి లంక గుట్టు లాగడం ధర్మమా, సీతని నిప్పుల్లో దూకమనడం భావ్యమా - యిలాంటి అంశాలను తర్కిస్తూ తెలియని లోతుల్లోకి వెళ్లలేదు. పండితులకు నేను చెప్పగలవాణ్ణి కాదు. సామాన్య పాఠకులకు ముఖ్యంగా బిడ్డలకన్న తల్లులను మనసులో పెట్టుకుని రాశాను. ఇందులో ఒక్క ముక్క నా సొంతం లేదు. నాలుగుచోట్ల పరిగ ఏరి దీనిని యిక్కడ కూర్చాను. రాముడి కథను కిష్కింధవాసుల చేష్టలతో కలిపి తమ పిల్లలకు కొందరు తల్లులైనా చెబుతారని నా ఆశ. 20-04-2005 నవ్వయ సంచికలో ప్రారంభమై 4-07-2007 సంచికతో పూర్తయింది. రామాయణంలో ముఖ్యఘట్టాలను క్రమంలో చెబుతూ కథను పూర్తి చేశాను. యాగరక్షణకు విశ్వామిత్రుని వెంట రాముడు వెళ్లడంతో మొదలుపెట్టాను. ఆ ప్రయాణం కల్యాణప్రధమై, అయోధ్య రాముడు కల్యాణరాముడు అయినాడు. బాలకాండను యిక్కడ సంక్షిప్తంగా వివరిస్తున్నాను. - శ్రీరమణ
Tags: Sri Ramayanam, శ్రీ రామాయణం, శ్రీరమణ, Sri Ramana