Ha Ha Hu Hu, Maa Babu  |  హాహాహూహూ, మాబాబు

Ha Ha Hu Hu, Maa Babu | హాహాహూహూ, మాబాబు

  • ₹250.00

హాహాహూహూ నవల రచనాకాలం 1952గా భావిస్తున్నట్టు గ్రంథకర్త కుమారుడు, నవల సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెప్తూండగా లిపిబద్ధమైన ఈ నవలను ఎవరు లిపిబద్ధం చేశారన్నది సమాచారం, ప్రథమ ముద్రణ సంవత్సరం తెలియదని పావనిశాస్త్రి తెలిపారు. ఈ నవల1982లో ఆంధ్రజ్యోతి - సచిత్ర వార పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఈ పుస్తకం ఏడవ ముద్రణ 2006లో జరిగింది. 2013లో మరో ముద్రణ జరిగింది.

లండనులోని "ట్రెఫాల్గర్ స్క్వేర్" వద్ద గుర్రపు తల, మనిషి శరీరంతో వింతజంతువు కనిపిస్తుంది. చేతికి కడియం, ఒంటికి దుస్తులు, ఎనిమిదడుగుల ఎత్తు ఉన్న ఆ విచిత్ర జీవి స్పృహలో ఉండదు. జంతు ప్రదర్శనశాలలో ఉంచిన ఆ వింతజంతువును చూసేందుకు తీర్థప్రజల్లా జనం తండోపతండాలుగా వస్తారు. మేలుకున్నాకా ఆ జంతువు మాట్లాడుతూండడం, నవ్వుతూండడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ జంతువు చివరకు ఓ పోలీస్ వద్ద తుపాకీ లాక్కోవడంతో భయమూ పొందుతారు. చివరకు ఆ జంతువు జంతువు కాదు, అది మాట్లాడుతున్న భాష సంస్కృతం అని తేలుతుంది.

మాబాబు నవలలో కథానాయకుడు ఉత్తమ పురషలో తానే "నేను" అని కథ చెబుతాడు. ఈ కథలో కథానాయకునితో సహా ఎవరికీ పేర్లు ఉండవు. అతను పుట్టుకతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ. అతనిని తన పినతల్లి తీసుకెళ్ళింది కానీ ఆమె కుటుంబంలో ఆమె మాటకు విలువ లేకపోవడంతో అతను పిల్ల పాలేరుగా ఆ ఇంట్లో పెరిగాడు. ఏడేళ్ళ వయసులో ఆ ఇంటినుండి పారి పోయి అనేక ఊళ్ళు తిరుగుతో పోతే ఒక గ్రామంలో తనను దొంగ అనుకుని చచ్చేట్లు కొట్టి గుంజకు కడతారు. మర్నాడు ఆ గ్రామంలో మోతుబరి రైతు అతనిని చూసి జాలిపడి తన ఇంటికి తీసుకొని పోయి ఆశ్రయమిస్తాడు. ఆ పెద్దాయనను అతను "బాబు" అని పిలుస్తాడు. ఆ పెద్దాయన పేరే ఈ నవల శీర్షిక "మా బాబు". ఆ పెద్దాయన కుటుంబం తనకు దయతో చూస్తుంది. ఆ పిల్లాడు సహజంగా ప్రతిభావంతుడు కావడంలో రెండేళ్ళలో వ్యవసాయం, వ్యవహారాలు, కొంత చదువు నేర్చుకుని పెద్దాయనకు సహాయంగా ఉంటాడు.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Ha Ha Hu Hu, Maa Babu, హాహాహూహూ, మాబాబు, విశ్వనాథ సత్యనారాయణ, Viswanatha Satyanarayana, Sri Viswanatha Publications, శ్రీ-విశ్వనాథ-పబ్లికేషన్స్