Sri Sri Samsara Prasthanam | శ్రీ శ్రీ సంసార ప్రస్థానం
- Author:
- Pages: 427
- Year: 2010
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹200.00
విజయనగరం వాస్తవ్యులు -మధ్య తరగతి కుటుంబీకులు - హైస్కూల్ హెడ్మాస్టరూ అయిన శ్రీ ఉపద్రష్ట సూర్య నారాయణ. మ.స. సీతారామయ్యగార్లకు జన్మించిన కుమార్తెను నేను. మా తల్లిదండ్రులకి పదిమంది సంతానం. వచ్చే 150 రూపాయల జీతంతో పిల్లల చదువులు, పెరుగుదల ఇబ్బందిగానే వుండేది. కానీ మా నాన్నగారు పెద్ద ఆశావాది. ఆడపిల్లలంటే పంచప్రాణాలు అదే ఈనాడు మా భవిష్యత్తుకు పునాది అయ్యింది.
మేము ఆరుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలం. పసితనంలోనే ఇద్దరు కళ్ళుమూసేరు. ఆడపిల్లల కెవరికీ ఇంగ్లీషు చదువులు లేవు. చిన్నతనంలోనే నన్ను సంగీతంలో ప్రవేశపెట్టారు. నా జాతకంగానీ, పుట్టిన తేదీగానీ, సంవత్సరం గానీ సరిగ్గా లేవు. మా నాన్నగారికి నేనంటే అపరిమితమైన ప్రేమ, ఒకటి మాత్రం బాగా తెలుసు. కార్తీక బహుళ అష్టమినాడు మాత్రం పుట్టాను. ఈ మాసం నాకూ, శ్రీశ్రీ గారికి కూడా చాలా ఇష్టమైన మాసం. నేను చిన్నప్పుడు చాలా అల్లరి పెట్టేదాన్నట. 8వ ఏటనే శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారి ఫేవరేట్ కథ అయిన 'శ్రీ రుక్మిణీ కళ్యాణం' హరి కథని వారి ప్రియశిష్యులైన శ్రీ శ్రీపాద సన్యాసరావుగారి దగ్గర దాసుగారి బాణీలో నృత్యం, అభినయంతో సహా నేర్చుకున్నాను. 8 నెలలలో ఆ కథంతా కంఠస్తం చేసేశాను. అది నా ఫేవరేట్ కథ అయ్యింది. రామాయణం మొత్తం నేర్చుకున్నాను. రుక్మిణీ కళ్యాణం మాత్రం వందసార్లు వంద స్థలాల్లో చెప్పాను. ఆ రోజుల్లో 'మాష్టారమ్మాయి బాలభాగవతారిణి ఉపద్రష్ట సరోజినీకుమారి' అనేవారు.
Tags: శ్రీ శ్రీ సంసార ప్రస్థానం, Sri Sri Samsara Prasthanam, సరోజా శ్రీశ్రీ